Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కోర్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ పార్టీ అధిష్టానం. ఈ కోర్ కమిటీలో 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు.
చదవండి : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 101 కరోనా కేసులు
13 మంది సభ్యులు :
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ సీనియర్ నేత పురందేశ్వరి, పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు తోపాటు సత్యకుమార్, ఎమ్మెల్సీ మాధవ్, మధుకర్, నిమ్మక జయరాజ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి సభ్యులుగా ఉన్నారు.
చదవండి : BJP Chief Bandi Sanjay : రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది-బీజేపీ చీఫ్ బండి సంజయ్
ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు :
సునీల్ దేవధర్, మురళీధర్, శివప్రకాశ్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని బీజేపీ హైకమాండ్ వెల్లడించింది.