TDP Alliance : ఢిల్లీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల పంచాయితీ!

TDP Alliance : అమిత్ షా, నడ్డా సమయం కుదరకపోవడంతో చంద్రబాబు, పవన్ భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటల సమయంలో పొత్తుల పంచాయితీపై సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.

Chandrababu Naidu

TDP Alliance : దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల పంచాయితీ ఎటూ తేలడం లేదు. ఎన్డీఏలో చేరడంపై దాదాపు స్పష్టత వచ్చినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

నిన్నటి నుంచి చంద్రబాబు, పవన్ ఢిల్లీలోనే మకాం వేశారు. గురువారం అర్ధరాత్రి వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిగాయి. ఈ రోజు కూడా ఇరు పార్టీల నేతలు బీజేపీ అగ్రనేతలతో చర్చించాలని భావించారు.

Read Also : TDP- Janasena Alliance : చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. రెండుసార్లు భేటీలో అదే చర్చ..!

అయితే, శుక్రవారం (మార్చి 8న) బీజేపీ పెద్దలతో జరగాల్సిన భేటీ మరుసటి రోజు (శనివారం)కి వాయిదా పడింది. అమిత్ షా, నడ్డా సమయం కుదరకపోవడంతో చంద్రబాబు, పవన్ భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటల సమయంలో పొత్తుల పంచాయితీపై సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.

అమిత్ షా శనివారం పాట్నాలో పర్యటించనున్నారు. అంతకన్నా ముందే ఆయన్ను కలిసేందుకు చంద్రబాబు, పవన్ అపాయింట్ మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్పటివరకూ ఇరు పార్టీల అధినేతలు ఢిల్లీలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఇదివరకే, పొత్తులో భాగంగా సీట్లు ఎవరికి వచ్చినా గెలుపుకోసం కృషి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. జనసేన బీజేపీకి కలిపి 8 లోక్ సభ (అందులో జనసేన 3, బీజేపీ 5) అసెంబ్లీ (జనసేన 24, బీజేపీ 6) ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటులో లోకసభ, అసెంబ్లీలో ఎక్కువ సీట్లను బీజేపీ ఆశిస్తోంది. విశాఖ పార్లమెంట్ స్థానం బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది.

Read Also : Old City Metro Foundation : పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన.. ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ హైదరాబాద్ సిటీ!

ట్రెండింగ్ వార్తలు