TDP- Janasena Alliance : చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. రెండుసార్లు భేటీలో అదే చర్చ..!

TDP- Janasena Alliance : ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేయాలి అనే అంశంతో పాటు ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి? ఎవరిని బరిలో దింపాలి? అనే విషయంలోను కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

TDP- Janasena Alliance : చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. రెండుసార్లు భేటీలో అదే చర్చ..!

TDP chief Chandrababu Naidu And Pawan Kalyan discussion on Party Seats and alliance

TDP- Janasena Alliance : ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు‌తో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తొలుత ఆదివారం (ఫిబ్రవరి 4) మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన పవన్ సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత మళ్లీ ఇదే రోజు రాత్రి రెండోసారి ఇరువురు పార్టీల అధినేతలు భేటీ అయ్యారు. ఒకేరోజులో రెండు సార్లు భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also : Balashowry: పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి

ఈ భేటీలో ప్రధానంగా రెండు పార్టీల పొత్తులో భాగంగా సీట్ల సర్థుబాటుపై విస్తృత చర్చించినట్టు తెలిసింది. అంతేకాదు.. ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేయాలి అనే అంశంతో పాటు ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి? ఎవరిని బరిలో దింపాలి? అనే విషయంలోను కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

ఈ నెల 8న మరోసారి భేటీ :
చంద్రబాబుతో చర్చించిన అంశాలను పవన్ నేతలకు వివరించినట్టు తెలిసింది. ముందుగా నేతల సూచనలు, సలహాలను తీసుకున్న తర్వాతే మరోసారి చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో విశాఖ, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనకు కేటాయించే సీట్లపైనే ఉత్కంఠ నెలకొంది.

అయితే, ఈ జిల్లాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. కానీ, సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ నెల 8న భేటీ కావాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. 8వ తేదీ తర్వాత ఉమ్మడి మ్యానిఫెస్టో బహిరంగ సభలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read Also : Pawan Kalyan: జగన్ తనను తాను ఇలా పోల్చుకోవడం హాస్యాస్పదం: పవన్ పవర్‌ఫుల్ స్పీచ్