TTD : టీటీడీ కేసు వాదించటానికి తిరుపతి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి

టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు.

Subrahmanya Swamy In Tirupathi

TTD :  బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఈ రోజు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీటీడీ అభ్యర్ధన మేరకు వంద కోట్ల రూపాయల పరువునష్టం కేసు ఫైల్ చేశామని చెప్పారు. నా తరపున టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ సత్య సబర్వాల్ కేసు వాదిస్తారు.

కేసు ఫైల్ అయ్యి 90 రోజులు కావస్తున్నా, సదరు దినపత్రిక నుంచి ఇంతవరకు ఎలాంటి కౌంటర్ దాఖలు కాలేదు… ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆ పత్రిక‌ను ఆదేశించిందని ఆయన చెప్పారు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి అవసరం. అందుకోసం నేను చాలాకాలంగా పోరాటం చేస్తున్నాను. టీటీడీ కాగ్ పరిధిలోకి రానుంది. వచ్చే ఏడాది నుంచి టీటీడీ ఆడిట్ కాగ్ పరిధిలోకి వెళుతుందని భావిస్తున్నానని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని నా అభిమతం అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు.

Also Read : Hyderabad : వివాహేతరం సంబంధం పంచాయితీ-మామను చంపిన అల్లుడు