Polavaram project : పోలవరం కోసం భారీగా నిధులు వస్తున్నాయ్ : బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎప్పటికి అవుతుంది? ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఫలితాలు ఎప్పటికి అందుతాయి? అనే ప్రశ్నలకు కేంద్ర శుభవార్త చెప్పింది.

bjp mp gvl..polavaram project : ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎప్పటికి అవుతుంది? ఈ ప్రాజెక్టు నిర్మాణ ఫలాలు ఎప్పటికి అందుతాయి? అనే ప్రశ్నలకు కేంద్ర శుభవార్త చెప్పింది. పోలవరం ప్రాజెక్టు కోసం నిధులను త్వరంలోనే విడుదల చేయబోతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం కేంద్ర ఇవ్వబోతోంది అని వెల్లడించారు.

 

పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతోందని దీనికి కేబినెట్ ఆమోదం పొందాక నిధుల్ని విడుదల చేస్తారని వెల్లడించారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల కోసం కేంద్రం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని వెల్లడించారు.

BJP MP GVL : ఏపీలోనే ఈ వింత పరిస్థితి, కేంద్రం నిధులిస్తుంటే ఎందుకిస్తున్నారని అనటం ఏ రాష్ట్రంలోను చూడలేదు

ఏపీ అభివద్ధి కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని..ఇప్పటికే రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చారని..ఈ రూ. 10 వేల కోట్లు ఏపీ ప్రజలకు వరం అని అన్నారు. ఏపీ అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని..బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో రూ.55వేల కోట్ల మేర ననేగా నిధులిచ్చిందని జీవీఎల్ తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు