BJP MP GVL : ఏపీలోనే ఈ వింత పరిస్థితి, కేంద్రం నిధులిస్తుంటే ఎందుకిస్తున్నారని అనటం ఏ రాష్ట్రంలోను చూడలేదు

కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడుగా ఖర్చు చేస్తున్నారని.. ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందని అన్నారు జీవీఎల్. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు. కేంద్రం నిధులిస్తుంటే ఏపీలో మాత్రం వింత పరిస్థితి ఉందని అన్నారు.

BJP MP GVL : ఏపీలోనే ఈ వింత పరిస్థితి, కేంద్రం నిధులిస్తుంటే ఎందుకిస్తున్నారని అనటం ఏ రాష్ట్రంలోను చూడలేదు

BJP MP GVL

BJP MP GVL : ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో ఏపీకి నిధులు వస్తున్నాయని..10 వేల 461 కోట్లు రూపాయలు రెవెన్యూ గ్రాంట్ గా ఏపికి కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంటే…ఎందుకు ఇస్తున్నారు అని కొంతమంది అడుగుతున్నారని..ఇటువంటి వింత పరిస్థితి ఏ రాష్ట్రంలో చూడలేదన్నారు. మోదీ ఏపీకి నిధులు కేటాయించటంలో ఎటువంటి రాజకీయ లబ్దీ లేదని స్పష్టం  చేశారు జీవీఎల్.

 

మోదీ ఎప్పుడు రాజకీయ లబ్ది కోసం పని చెయ్యరు..ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు.కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడుగా ఖర్చు చేస్తున్నారని.. ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందని ఆరోపించారు.రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందని వెల్లడించారు. పోలవరం రిజెక్ట్ పై ప్రధానికి చాలా సానుకూలంగా ఉన్నారని..పోలవరం ప్రాజెక్ట్ కి అదనంగా 12 వేల 911 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. పోలవరం 41.15 మీటర్ల వరకు తొలి దశ నిర్మాణం కోసం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. రాష్ట్రంలో‌ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఛార్జిషీటు ద్వారా ప్రజలకు వివరిస్తామని..కేంద్ర పధకాలకు జగన్ స్టిక్కర్లను వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు జీవీఎల్.

 

Polavaram project : పోలవరం కోసం భారీగా నిధులు వస్తున్నాయ్ : బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన

 

పోలవరం ప్రాజెక్టు కోసం నిధులను త్వరంలోనే విడుదల చేయబోతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం కేంద్ర ఇవ్వబోతోంది అని వెల్లడించారు.ఏపీ అభివద్ధి కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని..ఇప్పటికే రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు.