Amaravati : మూడు రాజధానులు అమలు సాధ్యం కాదని జగన్ కు బాగా అర్థం అయ్యింది : జీవిఎల్

మూడు రాజధానులు అమలు సాధ్యం కాదని జగన్ కు బాగా అర్థం అయ్యింది అని..రాజకీయాల కోసం అమరావతిని బలి పట్టవద్దని బీజేపీ ఎంపీ జీవిఎల్ అన్నారు.

Amaravati : అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు రైతులతో బీజేపీ ఎంపీ జీవీఎల్ భేటీ అయ్యారు. వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవిఎల్ మాట్లాడుతూ..మూడు రాజధానులు అమలు చేయటం సాధ్యం కాదు అనే విషయం జగన్ కు బాగా అర్థం అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని దెబ్బతీసేందుకే అమరావతిని నిర్లక్ష్యం చేశారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. అమరావతి పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించిన అనంతరం తుళ్లూరు రైతులతో ఆయన సమావేశమైన సందర్భంగా జీవీఎస్ ఈ వ్యాఖ్యలు చేశారు.టీడీపీని..ఆ పార్టీ అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వైకాపా యత్నిస్తోందని అన్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అమరావతిని ఆదర్శ రాజధాని చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాక ప్రజలకు జగన్ నమ్మక ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. రాజకీయాల కోసం అమరావతిని బలిపెట్టొద్దు అని జగన్ కు హితవు పలికారు.

Also read : Nellore Student : ఆర్టీసీ బస్సు వెనకాల నిచ్చెన పట్టుకుని వేలాడుతూ 5 కి.మీ ప్రయాణించిన విద్యార్థి

జగన్ మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజల్ని జగన్ నట్టేట ముంచారని.నమ్మి ఓట్లు వేసినవారిని నడిరోడ్డుమీ నిలబెట్టారంటూ విమర్శించారు. మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని జగన్ సర్వ నాశనం చేశారంటూ మండిపడ్డారు. మూడు రాజధానులు అమలు సాధ్యం కాదు అనే విషయం జగన్ కు బాగా అర్థం అయ్యింది అంటూ ఎద్దేవా చేశారు. దానికి సంబంధించి నిర్ణయం తీసుకుని కూడా పూర్తిగా చెప్పకుండా డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. రాజధాని అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా గానీ మిన్నకుండి ఉండిపోయాడని హైకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తున్నాడని విమర్శించారు.

Also read : Prakasam District : ప్రకాశం జిల్లాలో పెళ్లి చేసుకుని పరారైన భర్త

హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ మూడు రాజధానులు అనడం తప్పని..ఆ తీర్పును ధిక్కరించేలా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉందని జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని బీజేపీ తీర్మానం చేసి చెప్పిందన్నారు. హైకోర్టు తీర్పు అమల్లో ఉండగా.. మూడు రాజధానులు లాంటి వేరే ప్రస్తావన చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసే సత్తా ఉంటే ఎందుకు చేయలేదని జీవీఎల్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా మొండివైఖరిని విడనాడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు