Nellore Student : ఆర్టీసీ బస్సు వెనకాల నిచ్చెన పట్టుకుని వేలాడుతూ 5 కి.మీ ప్రయాణించిన విద్యార్థి | A student who traveled 5 km hanging from a ladder behind an RTC bus

Nellore Student : ఆర్టీసీ బస్సు వెనకాల నిచ్చెన పట్టుకుని వేలాడుతూ 5 కి.మీ ప్రయాణించిన విద్యార్థి

ఇది ఆకతాయిల పనేనని అధికారులు చెబుతున్నారు. కాగా, బస్సు ఆపకపోవడంతోనే విద్యార్థి అలా వెళ్లాడని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఈ ఘటన పోలీసులు, కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది.

Nellore Student : ఆర్టీసీ బస్సు వెనకాల నిచ్చెన పట్టుకుని వేలాడుతూ 5 కి.మీ ప్రయాణించిన విద్యార్థి

student traveled bus : నెల్లూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి నిర్వాకం వెలుగు చూసింది. ఆర్టీసీ బస్సు వెనకాల నిచ్చెన పట్టుకుని ప్రయాణించాడు. మనుబోలు నుంచి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వరకు వేలాడుతూనే ప్రయాణించాడు. 5 కిలోమీటర్లు నిచ్చెనపట్టుకుని విద్యార్థి ప్రయాణించాడు.

అయితే, ఘటనపై సమాచారం లేదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇది ఆకతాయిల పనేనని అధికారులు చెబుతున్నారు. కాగా, బస్సు ఆపకపోవడంతోనే విద్యార్థి అలా వెళ్లాడని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఈ ఘటన పోలీసులు, కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది.

Students Attack Teacher : చెత్త బ‌కెట్‌తో టీచర్‌ని దారుణంగా కొట్టిన స్కూల్ విద్యార్థులు

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులు ఆకతాయి పనులు చేస్తూ ప్రమాదంలో పడుతున్నారని పలువురు అంటున్నారు. కొంటే పనులు చేస్తూ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు.

×