Students Attack Teacher : చెత్త బ‌కెట్‌తో టీచర్‌ని దారుణంగా కొట్టిన స్కూల్ విద్యార్థులు

మాస్టారు అనే గౌరవం గానీ..భయం గానీ లేని విద్యార్ధులు దారుణంగా ప్రవర్తించారు.స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టారిని చెత్త బక్కెట్ తో దారుణంగా కొట్టారు.

Students Attack Teacher : చెత్త బ‌కెట్‌తో టీచర్‌ని దారుణంగా కొట్టిన స్కూల్ విద్యార్థులు

School Students Attack Teacher With Dust Bin

students attack teacher with Dustbin : క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరులో స్కూల్ విద్యార్ధులు మాస్టారు అంటే గౌరవం అనే మాట పక్కన పెడితే కనీసం భయం అనేది కూడా లేకుండా దారుణంగా ప్రవర్తించారు. చెత్త బక్కెట్ తో మాస్టార్ ని కొట్టారు. నిండా 15 కూడా లేని స్కూల్ పిల్లలు మాస్టార్ ని బక్కెట్ తో కొట్టారు. చెత్త బక్కెట్ ను మాస్టారు తలపై బోర్లించి నానా యాగీ చేశారు. కొట్టారు. తిట్టారు. ఏదో కాలేజీల్లో లెక్చరర్స్ ను విద్యార్ధలు నిక్ నేమ్ లతో టీజ్ చేస్తుంటారు. కానీ స్కూల్ విద్యార్ధులే ఏకంగా మాస్టార్ ని దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దావ‌ణ‌గెరే జిల్లా చెన్న‌గిరి తాలూక న‌ల్లూర గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో డిసెంబర్ 3న ప్రకాశ్ అనే హిందీ మాస్టారుని దారుణంగా అవమానించి కొట్టారు విద్యార్ధులు. గురువన్న గౌరవం లేదు.. వ‌య‌సులో పెద్ద‌వాడ‌న్న మ‌ర్యాద అసలే లేదు. భయం అంతకంటే లేని పిల్లలు స్కూల్లో టీచ‌ర్‌ పాఠాలు చెబుతుంటే ఒక్కసారిగా రెచ్చిపోయారు. మాస్టారిపై చెత్తబక్కెట్ తో దాడికి పాల్పడ్డారు. ఒక విద్యార్థి..మాస్టారు ప్యాంటు పట్టుకుని లాగాడు. మరొకడు జుట్టు పట్టుకుని లాగాడు. తరువాత చెత్త బక్కెట్ పట్టుకొచ్చి మాస్టారు తలపై బోర్లించారు.

పిల్ల‌లు అంత‌గా రెచ్చిపోతోన్నా ఆ మాస్టారు కనీసం మాట వరుసకు కూడా కోప్పడలేదు.విద్యార్ధులు తనను అవమానిస్తున్నా కిమ్మనలేదు. వారి ఆకతాయి పోకిరీ చేష్ట‌ల‌ను భ‌రించారు. అయని విద్యార్థులు ఏమాత్రం తగ్గలేదు. చెత్త బ‌కెట్‌ను ఆ మాస్టారు త‌ల‌పై పెట్టి వీడియో కూడా తీసి వెకిలిగా నవ్వులు నవ్వుతు తిట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. పిల్ల‌ల‌పై పోలీసు కేసు కూడా న‌మోదు చేసే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని అధికారులు చెప్పటం విశేషం. స్కూల్లో అంత జరుగుతున్నా నాకేమీ తెలీదంటున్నాడు హెడ్మాస్టారు.

ఆ విద్యార్థులు హిందీ టీచ‌ర్ ప్ర‌కాశ్‌ను గ‌తంలోనూ వేధించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా వీడియో వైర‌ల్ కావ‌డంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచ‌ర్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన విద్యార్థుల‌కు టీసీలు ఇచ్చి పంపించారు. ఈ విష‌యం అధికారుల దృష్టికి రావ‌డం, వీడియో వైర‌ల్ కావ‌డం వంటి విషయాలతో తో టీచ‌ర్ ప్ర‌కాశ్‌ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.దీంతో ఆయన ఛాతీ నొప్పితో ఆసుప‌త్రిలో చికిత్సతీసుకుంటున్నారు.