Prakasam District : ప్రకాశం జిల్లాలో పెళ్లి చేసుకుని పరారైన భర్త

పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న భర్త అత్తింటి వారి మాటలతో కనిపించకుండా పోయాడని, తనకు న్యాయం చేయాలని ఒక మహిళ ప్రకాశం జిల్లా పోలీసులను వేడుకుంటోంది.

Prakasam District : ప్రకాశం జిల్లాలో పెళ్లి చేసుకుని పరారైన భర్త

prakasam district

Prakasam District : పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న భర్త అత్తింటి వారి మాటలతో కనిపించకుండా పోయాడని, తనకు న్యాయం చేయాలని ఒక మహిళ ప్రకాశం జిల్లా పోలీసులను వేడుకుంటోంది. ప్రకాశం జిల్లా గిద్దూలూరు కుచెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్, హెబ్సిబా గత 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరి మతాలు వేరు కావటంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని తెలిసి,  వారికి తెలియకుండా  ఏప్రిల్ 9వ తేదీన చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం వేరు కాపురం పెట్టి జీవించసాగారు. ఒక రోజు తన తండ్రికి ఒంట్లో బాగోలేదని తెలియటంతో భార్య హెబ్సిబాను వెంట పెట్టుకుని తన తల్లితండ్రుల వద్దకు వెళ్లాడు ఇమ్రాన్.

ఇమ్రాన్ పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకుని అతని తల్లితండ్రులు హెబ్సిబాను కులం  పేరుతో దూషించారు. తండ్రికి బాగోలేదని నంద్యాల ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకువెళ్దామని ఇమ్రాన్‌ను  వారితో పాటు తీసుకువెళ్ళారు.  ఇక అప్పటి నుంచి ఇమ్రాన్ హెబ్సిబాకు కనపడకుండా మొహం చాటేసి తిరుగుతున్నాడు.

చివరకు ఇంట్లో తల్లితండ్రులు పెళ్లికి ఒప్పుకోవటం  లేదని సమాచారం ఇచ్చాడు. దాంతో ఖంగుతున్న హెబ్సిబా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇమ్రాన్ కుటుంబ సభ్యులను పిలిచి  కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అందుకు  ఇమ్రాన్ కుటుంబ సభ్యులు సహకరించక  పోవటంతో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయటంతో ఇమ్రాన్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.