చిత్తూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. కుప్పంలోని వైసీపీ కార్యాలయం ముందు క్షుద్రపూజల చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం దుమారానికి దారి తీసింది. కుప్పంలోని బైపాస్ రోడ్ లోని పార్టీ ఆఫీసు గేటు ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. పసుపు, కుంకుమ, టెంకాయ, నిమ్మకాయలతో పూజలు చేశారు. ఈ విషయం ఇప్పుడు కుప్పంలో చర్చనీయాంశంగా మారింది.
https://10tv.in/pm-modi-twetter-shared-spectacular-video-of-gujarath-sun-temple/
రంగంలోకి దిగిన పోలీసులు ఈ క్షుద్రపూజల ఘటనపై విచారణ చేస్తున్నారు. అసలు క్షుద్ర పూజలేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కొందరు వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కొందరు వ్యక్తులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.