Krishna River Boat: కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ప్రవాహం అంతా కూడా ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు పెడుతోంది. దీంతో కృష్ణా నదిలో ఒక బోటు కొట్టుకొచ్చింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి బోటు కొట్టుకొచ్చినట్లుగా గుర్తించారు అధికారులు. డ్రోన్ ద్వారా బోటును కనిపెట్టారు. వెంటనే స్టేట్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. తుమ్మలపాలెం దగ్గర బోటుని గుర్తించి ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు అధికారులు.
ఆ బోటు పాడైపోయి ఉందని అధికారులు గుర్తించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నుంచి ఆ బోటు కృష్ణా నది వరద ప్రవాహానికి కొట్టుకొచ్చింది. వరద ప్రవాహానికి సంబంధించి నిరంతరం డ్రోన్లతో అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. బోటు కొట్టుకొస్తున్న దృశ్యాలు డ్రోన్లలో కనిపించాయి. వెంటనే అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. బోటు కొట్టుకొస్తోంది అనే సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు అందించింది. విపత్తు నిర్వహణ సంస్థ వెంటనే రియాక్ట్ అయ్యింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గత ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఆ బోట్టుని ఒడ్డుకి తీసుకొచ్చారు. ఆ బోటు ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లకుండా ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో ముప్పు తప్పిందని చెప్పొచ్చు. ఒకవేళ ఆ బోటు ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గరకు వచ్చి ఉంటే పెను ముప్పు ఏర్పడి ఉండేదని అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది ఇదే సమయంలో కృష్ణా నదికి భారీ వరద వచ్చింది. ఆ సమయంలో మూడు పెద్ద పెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజీకి అడ్డుగా గేట్లలో చిక్కుకుపోయాయి. దీని కారణంగా పెద్ద ప్రమాదం ఏర్పడింది. అయితే తృటిలో ప్రమాదం తప్పింది. దాదాపు 8 నుంచి 10 రోజులు శ్రమిస్తే తప్ప ఆ బోట్లు బయటకు రాని పరిస్థితి. అలాంటి ప్రమాదమే ఇవాళ జరిగేది. అయితే, డ్రోన్లతో పర్యవేక్షణ జరుగుతున్న నేపథ్యంలో బోటు కొట్టుకొస్తున్న విషయం వెలుగుచూసింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు తుమ్మలపల్లి వద్ద బయటకు తీశారు. పెను ముప్పు తప్పడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
Also Read: మొంథా తుపాను నష్టంపై ఏపీ సర్కార్ ప్రాథమిక అంచనా.. ఎన్ని వేల కోట్లు అంటే..