Boats Capsize In Sileru Reservoir
Sileru Boats Capsize : విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్ లో రెండు నాటు పడవలు బోల్తా పడటంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. ముగ్గురు మాత్రం క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో నలుగురి కోసం గజఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటన సీలేరుగుంట వాడ వద్ద జరిగింది. కాగా కొందుగూడ గ్రామస్తులు మొత్తం ఐదు నాటు పడవల్లో ప్రయాణిస్తుండగా అందులో రెండు పడవలు బోల్తా పడ్డాయి.
బాధితులంతా కొందుగూడ వాసులు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.