Bommanhal Electric Shock Incident : బొమ్మనహల్ విద్యుత్ షాక్ ఘటన.. ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

బొమ్మనహల్ విద్యుత్ షాక్ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Bommanhal Electric Shock Incident : అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో విద్యుత్ వైర్లు తెగిపడి నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంను ఆదేశించింది ప్రభుత్వం.

Andhra pradesh : విద్యత్ తీగలు తెగిపడి ఆరుగురు మహిళా కూలీలు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలి పనులకు వెళ్లిన మహిళలను మృత్యువు కబళించింది. పంట కోతలు చేస్తుండగా 33కేవీ విద్యుత్తు లైన్‌ తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. రాయదుర్గం తాలుకా బొమ్మనహాల్‌ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

గ్రామ సమీపంలోని ఓ రైతు పొలంలో మొక్కజొన్న కంకులు కోయడానికి కూలీలు వెళ్లారు. కోసిన వాటిని ట్రాక్టర్‌లో లోడ్‌ చేస్తుండగా.. విద్యుత్‌ తీగ ట్రాక్టర్‌పై తెగిపడింది. కరెంట్ షాక్ తో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో బళ్లారి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Anantapur Electric Shock Incident : అనంతపురం విద్యుత్ షాక్ ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా

 

జూన్‌లో ఇదే తరహా ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి..
కాగా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూలీలు ఎక్కువగా విద్యుత్ షాక్ కు బలవుతున్నారు. ఈ ఏడాది జూన్ లోనూ ఇదే తరహా విద్యుత్ ప్రమాదం జరిగింది. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు ఆటోలో వెళ్తున్న సమయంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి ఆటో మీద తెగిపడ్డాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఆటో దగ్ధమైపోయింది. ఐదు నిండు ప్రాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 13 మంది(డ్రైవర్ సహా) ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటనలో మరణించిన వారంతా మహిళలే. ఇప్పుడు అలాంటిదే మరో ప్రమాదం చోటు చేసుకుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే, ఈ ప్రమాదానికి ఉడుత కారణమై ఉండొచ్చని ఉడుతపై నెపం నెట్టేశారు అధికారులు. కరెంటు పోల్ పైకి ఉడత ఎక్కినప్పుడు ఇన్సులేటర్‌ నుంచి కండక్టర్‌కు షార్ట్‌సర్క్యూట్‌ అయి మధ్యలో తీగ తెగి అదే సమయంలో అటుగా వస్తున్న ఆటోపై పడిందని ఎస్పీడీసీఎల్‌ అధికారులు తెలిపారు. కాగా… తీగలు, ఇన్సులేటర్లు నాసిరకంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.