Anantapur Electric Shock Incident : అనంతపురం విద్యుత్ షాక్ ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నూరు గ్రామంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Anantapur Electric Shock Incident : అనంతపురం విద్యుత్ షాక్ ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా

Anantapur electric shock Incident : అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం దర్గా హోన్నూర్ గ్రామంలో విద్యుత్ తీగలు తెగి మీద పడడంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్.

బొమ్మనహల్ విద్యుత్ షాక్ ఘటనలో విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అలాగే బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిస్కమ్ లను ఆదేశించింది ప్రభుత్వం.

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పంట కోత పనులకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడ్డాయి. బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Andhra pradesh : విద్యత్ తీగలు తెగిపడి ఆరుగురు మహిళా కూలీలు మృతి

వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగింది. ఘటన స్థలం.. మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారింది. తమ వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేక కుటుంబసభ్యులు రోదించిన తీరు అందర్నీ కలచివేసింది. బాధితులను హోన్నూరు గ్రామం ఎర్రనాల కాలనీవాసులుగా గుర్తించారు.

జూన్‌లో ఇదే తరహా ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి..
ఈ ఏడాది జూన్ లోనూ ఇదే తరహా విద్యుత్ ప్రమాదం జరిగింది. జూన్‌లో సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు ఆటోలో వెళ్తున్న సమయంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి ఆటో మీద తెగిపడ్డాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఆటో దగ్ధమైపోయింది. ఐదు నిండు ప్రాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 13 మంది(డ్రైవర్ సహా) ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటనలో మరణించిన వారంతా మహిళలే. ఇప్పుడు అలాంటిదే మరో ప్రమాదం చోటు చేసుకుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వరుస విద్యుత్ ప్రమాదాలకు కారణాలేంటి?
విద్యుత్ ప్రమాదాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణం అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరాకు నాణ్యత లేని వైర్లు వాడుతున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. హైటెన్షన్ తీగలకు బదులుగా లోటెన్షన్స్ తీగలు వేయడం, ఇన్సులేటర్లు, కండక్టర్లు వంటి వాటి ప్రమాణాలను తగిన రీతిలో పరీక్షించడం లేదని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారులతో కుమ్మక్కై.. ఇలాంటి నాసిరకం వైర్లను సరఫరా చేయడం వల్ల… ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయించడం లేదని, వైర్ల నాణ్యతపై ఎలాంటి పరిశీలన చేయించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి, పరిహారం ప్రకటించి, అధికారులపై వేటు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.