Acupressure: ఆకుప్రెషర్.. వేళ్ళలో ఆరోగ్యం.. ఏ వేలుని ఎక్కడ నొక్కితే ఏ సమస్య తగ్గుతుందో తెలుసా?

చైనీస్ ప్రాచీన వైద్య విధానం. ఈ ప్రక్రియలో శరీరంలోని కొన్ని నిర్దిష్ట బిందువులను నొక్కిపట్టడం (Acupressure) ద్వారా శక్తి ప్రవాహాన్ని

Acupressure: ఆకుప్రెషర్.. వేళ్ళలో ఆరోగ్యం.. ఏ వేలుని ఎక్కడ నొక్కితే ఏ సమస్య తగ్గుతుందో తెలుసా?

Health benefits of doing acupressure

Updated On : August 18, 2025 / 5:42 PM IST

Acupressure: ఆకుప్రెషర్.. అనేది చైనీస్ ప్రాచీన వైద్య విధానం. ఈ ప్రక్రియలో శరీరంలోని కొన్ని నిర్దిష్ట బిందువులను నొక్కిపట్టడం ద్వారా శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడం, నొప్పులు తగ్గించడం, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం చేయవచ్చు. అలానే, మన చేతుల వేళ్లలో కూడా ఎన్నో ముఖ్యమైన బిందువులు ఉంటాయి. ప్రతి వేళ్లకి కొన్ని అవయవాలు, భావాలు, శారీరక వ్యవస్థలతో సంబంధం ఉంటుంది. కాబట్టి, ఆ వేలుని నొక్కిపట్టడం(Acupressure) వల్ల చాలా రకాల సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి ఏ వేలుని ఎక్కడ నొక్కితే ఏ సమస్య తగ్గుతుందో అనే విషయం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.బొటన వేలు (శ్వాసకోశం, భావోద్వేగాలు):
బొటన వేలు నొక్కడం వల్ల ఊపిరితిత్తులు, గుండె, మానసిక ఉల్లాసం వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో బొటనవేలు మొదటి భాగం మీద, మధ్యభాగాన్ని నెమ్మదిగా నొక్కాలి. ఇలా నొక్కడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు (ఆస్తమా, జలుబు) తగ్గుతాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గుండెకు రిలీఫ్ కలుగుతుంది

2. చూపుడు వేలు (జీర్ణ వ్యవస్థ):
ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. చూపుడువేలు మధ్యభాగాన్ని నెమ్మదిగా 1 నుంచి 2 నిమిషాలు నొక్కిపట్టడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని టాక్సిన్స్ ని తగ్గిస్తుంది.

3.మధ్యవేళి (నిద్ర, రక్తపోటు):
మధ్యవేళి చివరి భాగానికి దగ్గరగా నెమ్మదిగా నొక్కాలి. అలా కాసేపు పట్టుకోవడం వల్ల హై బి.పి, లో బి.పి నియంత్రణ, నిద్రలేమి సమస్యలకు ఉపశమనము, తలనొప్పి, చెమటలుఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.

4.ఉంగరం వేలు (శ్వాస, మానసిక స్థితి):
ఉంగరం వేలు మధ్య భాగాన్ని కొంచెం గట్టిగా నొక్కి పట్టుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. విచారం, నిరాశ భావాలను తగ్గిస్తుంది.

5.చిటికన వేలు (గుండె, మెదడు ఆరోగ్యం):
చిన్నవేళి చివర, మొదటి భాగాల మధ్య భాగాన్ని నొక్కి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గుండె వేగం నియంత్రణలో ఉంటుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. అలసట, మూర్ఛల భావం తగ్గుతుంది.

ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • రోజుకు 2 నుంచి 3 సార్లు ప్రతి వేళ్లను 1 నుంచి 2 నిమిషాలపాటు మాత్రమే నొక్కాలి
  • ప్రెగ్నెన్సీ, గుండె జబ్బులు ఉన్నవారు చేయకపోవడం మంచిది
  • మితంగా, నెమ్మదిగా నొక్కాలి, బలంగా నొక్కకూడదు.