Book Festival: విజయవాడలో బుక్ ఫెస్టివల్.. నేటి (జనవరి 1) నుంచే
పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. విజయవాడలోని బందర్ రోడ్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో జనవరి 1 నుంచి 11వ తేదీ వరకూ పుస్తక మహోత్సవం (బుక్ ఫెస్టివల్) జరగనుంది. 32వ పుస్తక ప్రదర్శనలో భాగంగా

Book Festival
Book Festival: పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. విజయవాడలోని బందర్ రోడ్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో జనవరి 1 నుంచి 11వ తేదీ వరకూ పుస్తక మహోత్సవం (బుక్ ఫెస్టివల్) జరగనుంది. 32వ పుస్తక ప్రదర్శనలో భాగంగా 210 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు తెలిపారు.
దేశంలోని ప్రముఖ పబ్లిషర్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. శనివారం (జనవరి 1) సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుస్తక ప్రదర్శను ప్రారంభిస్తారు. జనవరి 4వ తేదీన ప్రెస్ క్లబ్ నుంచి బందరు రోడ్ స్వరాజ్య మైదాన్ వరకు పుస్తక ప్రియులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నారు. చివరి రోజైన జనవరి 11వ తేదీ వీడ్కోలు సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ పదకొండు రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8గంటల 30 నిమిషాల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది. కోవిడ్ నిబంధనల మేరకు బుక్ ఫెస్టివల్‌లోకి ప్రవేశం ఉంటుందని, మాస్క్ లు ధరించిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, శానిటైజర్లు యూజ్ చేయాలని బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి.. కోహ్లీని టీ20 కెప్టెన్‌గా ఉండాలని బీసీసీఐ మొత్తం అడిగింది – చీఫ్ సెలక్టర్