డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారు- సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్

వైసీపీకి 600 మందికిపైగా సభ్యుల బలం ఉంది. కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉంది.

Botcha Satyanarayana (Photo Credit : Facebook)

Botcha Satyanarayana : ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎం చంద్రబాబు డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓట్లు కొనడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు బొత్స.

నర్సీపట్నంలో వైసీపీ ముఖ్య నేతలతో మాజీమంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, ఉమా శంకర్ గణేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

”వైసీపీకి 600 మందికిపైగా సభ్యుల బలం ఉంది. కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారు. ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్నాం. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలియదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి’ అని కేడర్ కు పిలుపునిచ్చారు బొత్స సత్యనారాయణ.

ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి సర్కార్ కుట్రలు చేస్తోంది- వైవీ సుబ్బారెడ్డి
అటు కూటమి సర్కార్ పై ఘాటు విమర్శలు చేశారు ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి. త్వరలో జరిగే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచేందుకు కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. డబ్బు ఆశ, పదవులు ఎరగా చూపి వైసీపీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ గుర్తు మీద గెలిచిన ప్రతి నాయకుడు.. జగన్ పిలుపు మేరకు పార్టీకి లాయల్ గా ఉంటారని ఆయన చెప్పారు. తప్పకుండా స్టాండింగ్ కౌన్సిల్ లో నిలబడ్డ 10 మంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడబోతున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. మంచి మెజారిటీతో గెలుస్తారని వైవీ సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు. మా పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వారు నిరూపిస్తారని వ్యాఖ్యానించారు.

 

Also Read : ఆ ఒక్కడి కోసం స్పెషల్‌ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?

ట్రెండింగ్ వార్తలు