Botsa Satyanarayana : పవన్ కళ్యాణ్ కు ట్యూషన్ చెబుతా : మంత్రి బొత్స

టెండర్లన్నీ పారదర్శకంగా, కోర్టు నియమించిన కమిటీల ద్వారా ఇచ్చామని తెలిపారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని పేర్కొన్నారు.

Botsa Satyanarayana counter tweet

Botsa Satyanarayana Counter Tweet : విద్యాశాఖపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ట్వీట్ చేశారు. టెండర్లన్నీ పారదర్శకంగా, కోర్టు నియమించిన కమిటీల ద్వారా ఇచ్చామని తెలిపారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని పేర్కొన్నారు. టెండర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏడు అంశాలను పేర్కొన్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు ట్యూషన్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

అయితే ఈ ఏడు అంశాలపై హోంవర్క్ చేయాలని బొత్స కండిషన్ పెట్టారు. అంతకముందు వైసీపీని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు, టీచర్ రిక్రూట్ మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు గానీ నష్టాలు వచ్చే స్టార్టప్ లకు మాత్రం కోట్లలో కాంట్రాక్టులు వస్తున్నాయని విమర్శించారు.

YS Sunitha : వైఎస్ వివేక హత్య కేసు.. సీబీఐకి సంచలన విషయాలు వెల్లడించిన సునీత

వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించదా? అని ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. టెండర్ల కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు? పబ్లిక్ డోమైండ్ ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సమస్యలపై వైసీపీ స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.