విశాఖలోనే సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది : బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చామని, ఉద్యోగులకు చెప్పే చేశామని బొత్స సత్యనారాయణ అన్నారు.

Botsa Satyanarayana : సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. విశాఖ పరిపాలన రాజధానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తరువాత కచ్చితంగా విశాఖలోనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించేకోలేదు. టీడీపీ వారి దోపిడీకోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారని బొత్స విమర్శించారు.

Also Read : బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సీట్ల త్యాగం.. ఈసారి అతి తక్కువ స్థానాల్లో పోటీ

కూటమి అభ్యర్థి భరత్ కు రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై అవగాహన ఉందా అని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 18వేల మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఇచ్చాం. భరత్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. లేదంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని బొత్స సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం. కూటమి అనుకూలమా? వ్యతిరేకమా చెప్పాలి. కూటమి నేతలకు చిత్తశుద్ది ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని బీజేపీ కీలక నేతలతో చెప్పించాలి. మోసం, దగా, కుట్ర చంద్రబాబు పేటెంట్. దేశంలో ప్రధాన నగరాలను తలదన్నెలా విశాఖ అభివృద్ధి చెందుతుందని బొత్స పేర్కొన్నారు.

Also Read : కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు మాకు ఢోకా లేదు: కిష‌న్‌రెడ్డి

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చామని, ఉద్యోగులకు చెప్పే చేశామని బొత్స సత్యనారాయణ అన్నారు. మద్యపాన నిషేధం దశలవారీగా చేసే ప్రక్రియ మొదలైంది. మద్యం అత్యవసర వస్తువు కాదు. చంద్రబాబు మద్యం తక్కువ ధరకే ఇస్తా అంటున్నాడు. ఇది ఆయనకే చెల్లింది. ఏపీలో నాసిరకం మద్యం అమ్ముతున్నామని చెప్పడానికి లేదు. చంద్రబాబుకు అలవాటు లేకపోయినా మద్యం కల్తీ అవుతుందని ఎలా చెబుతున్నాడని బొత్స ప్రశ్నించాడు. మద్యంలో కల్తీ ఉందని చెప్పాల్సింది చంద్రబాబు కాదు.. టెస్టులు చేస్తే అందులో తేలుతుంది అంటూ బొత్స ఎద్దేవా చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు