Site icon 10TV Telugu

Bridge Collapse: ఏడాది కూడా అవ్వలేదు, రూ.70 లక్షలు వృథా..! అల్లూరి జిల్లాలో వాగు ఉధృతికి కూలిన బ్రిడ్జి..

Bridge Collapse

Bridge Collapse: అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్ పురం మండలం అన్నవరం వద్ద కొండవాగుల ఉధృతికి బ్రిడ్జి కూలిపోయింది. దీంతో 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్థంభించిపోయాయి. 70 లక్షల రూపాయల వ్యయంతో గతేడాది బ్రిడ్జ్ నిర్మించారు. ఏడాదిలోపే వంతెన కూలిపోవటంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రిడ్జ్ కూలడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి లేక పోవడంతో బస్సు రవాణ సౌకర్యం లేక రెండేళ్లుగా ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఇటీవల కొత్తగా నిర్మించిన బ్రిడ్జితో బస్సు సౌకర్యం కలిగింది అని ఆనందించేలోపే బ్రిడ్జి కూలిపోయింది. మళ్లీ సమస్య మొదటికి వచ్చిందని స్థానికులు వాపోయారు. అధికారులు నాసిరకంగా బ్రిడ్జి నిర్మించడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న పాత బ్రిడ్జిని తొలగించడం వల్లే సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. కొత్తగా నిర్మించిన బ్రిడ్జికి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, నాసిరకం నిర్మాణం వల్ల కూలిందన్నారు. నిర్లక్ష్యానికి పాల్పడ్డ అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రాజకీయ కామెంట్స్‌

 

Exit mobile version