తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రాజకీయ కామెంట్స్‌

శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని అన్నారు.

తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రాజకీయ కామెంట్స్‌

Updated On : August 10, 2025 / 4:43 PM IST

తిరుమలలో టీటీడీ నిబంధనల ఉల్లంఘన జరిగింది. శ్రీవారి దర్శనానంతరం కొండపై రాజకీయ కామెంట్స్‌ చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్.

శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని అన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నామని చెప్పడానికి 12వ తేదీ జరిగే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Also Read: దంచికొడుతున్న వర్షం.. ఈ నెల 14 వరకు ఈ ప్రాంతాల్లో ఇంతే..

కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పులివెందుల జెడ్‌పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను తారుమారు చేసే కార్యక్రమం జరిగిందని ఆరోపించారు. ఓటర్లను భయపెట్టి పోలింగ్ బూత్‌కి రాకుండా చేసే విధంగా వ్యవహారం జరుగుతోందని అన్నారు. గతంలో ఎప్పుడు ఇంత దారుణంగా ఎలక్షన్లు జరగలేదని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాస్వామ్యం వెల్లివిరిసే విధంగా ఎలక్షన్లు జరిగాయని చెప్పుకొచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటే చంద్రబాబు, పవన్, లోకేశ్‌ నామినేషన్లు వేసే వాళ్లు కాదని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.