BRS MLA Malla Reddy
BRS MLA Malla Reddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. కుండపోత వర్షంకుతోడు బుడమేరుకు గండ్లు పడటంతో విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. వరదలు విజయవాడను అతలాకుతలం చేసినా 74ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తన అనుభవంతో వరదల్లో ప్రజలను కాపాడారని చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు.
Also Read : నాలుగు వారాలు టైం ఇస్తున్నాం..! తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు
మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని మల్లారెడ్డి ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఆ విషయంపై మల్లారెడ్డి స్పందించారు. నేను పార్టీ మారలేదు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి ఆదివారం అలిపిరి నుంచి నడక మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా నడకమార్గంలో తిరుమల చేరుకున్నారు. ఇవాళ ఉదయం మల్లారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.