Andhrapradesh
Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడు మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని వృద్ధుడిపై దాడిచేసి హత్య చేశాడు. ఆ తరువాత బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన విజయవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Also Read: Gold Silver Rates : హమ్మయ్య.. రాత్రికిరాత్రే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే?
చిట్టీనగర్ లౌక్య బార్ దగ్గర గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మైనర్ బాలుడు తాగిన మత్తులో మద్యం కోసం డబ్బులు సరిపోలేదని తాతాజీ (48)ని రూ.10 ఇవ్వాలని అడిగాడు. తాతాజీ పది రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన మైనర్ బాలుడు కత్తితో అతనిపై దాడి చేశాడు.
తాతాజీ తాపీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. మంగళగిరి నులకపేట ప్రాంతంలో ఉండేవాడు. పనికోసం విజయవాడలో జీవనం సాగిస్తున్నాడు. మైనర్ బాలుడు దాడి చేయడంతో తాతాజీ కిందపడిపోయాడు. రక్తపు మడుగులో పడిఉన్న తాతాజీని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతను మృతి చెందాడు.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని సీసీ కెమెరాలు ఆధారంగా పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే నిందితుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు.