Gold Silver Rates : హమ్మయ్య.. రాత్రికిరాత్రే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే?

Gold Silver Rates : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా..

Gold Silver Rates : హమ్మయ్య.. రాత్రికిరాత్రే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే?

Gold Silver Rates

Updated On : December 19, 2025 / 11:48 AM IST

Gold Silver Rates : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి.

Gold Rates

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 660 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 600 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 10 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,326 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది.

Gold Rate Today

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,23,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,34,180కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,150 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,34,330కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,23,000 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,34,180కు చేరింది.

Gold Rate in india

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,21,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,09,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,21,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read : Bangladesh Protests : ‘తగలబడుతున్న’ బంగ్లాదేశ్.. ఆందోళనలు హింసాత్మకం