Buddha Venkanna: ‘ఆ స్థానంలో నాకే టికెట్ ఇవ్వాలి’.. దుర్గమ్మ సన్నిధి నుంచి ర్యాలీకి బుద్ధా వెంకన్న సిద్ధం

రెండింట్లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతూ ర్యాలీ నిర్వహిస్తానన్నారు. బుద్ధా వెంకన్న ఆశించే రెండు స్థానాలనూ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ వెస్ట్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ రేపు టీడీపీ నేత బుద్ధా వెంకన్న ర్యాలీ నిర్వహించనున్నారు. ఒకవేళ విజయవాడ పశ్చిమ స్థానం తనకు ఇవ్వడం సాధ్యం కాదనుకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా ఇవ్వాలని బుద్ధా వెంకన్న అంటున్నారు.

రెండింట్లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతూ ర్యాలీ నిర్వహిస్తానన్నారు. దుర్గమ్మ సన్నిధి నుంచే తన వినతిని అధిష్ఠానానికి తెలుపుతానని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. కాగా, బుద్ధా వెంకన్న ఆశించే రెండు స్థానాలనూ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే టీడీపీ – జనసేన సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని సీట్ల విషయాన్ని టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. విజయవాడ పశ్చిమను మైనార్టీలకు కేటాయించాలంటూ ఇవాళ టీడీపీ మైనారిటీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. కాగా, విజయవాడ పశ్చిమ టికెట్‌ వ్యవహారం కొన్ని రోజులుగా టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

ఇక్కడి నుంచి సీటు కోసం టీడీపీ తరఫున ఇప్పటికే నలుగురు పోటీ పడుతున్నారు. జనసేన సైతం ఆ స్థానం తమకే కావాలంటూ పట్టుబడుతుండడంతో మరింత ఒత్తిడి పెరిగింది. విజయవాడ కీలక నేత కేశినేని నాని ఇప్పటికే టీడీపీని వీడినప్పటికీ పోటీ తగ్గడం లేదు.

ఒంగోలు ఎంపీ బరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..! కారణం అదేనా?