Byreddy Siddhartha Reddy
byreddy siddhartha reddy: తాను టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీలో చేరబోనంటూ చెప్పారు. నంద్యాల జిల్లాలో శుక్రవారం బైరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నారా లోకేష్‌ను నేను కలిసినట్లు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు అందుకు తగ్గ ఆధారాలుంటే చూపించాలి. టీడీపీలో చేరే ప్రసక్తే లేదు. నందికొట్కూరు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయించా. టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నష్టపోయిన షాపు యజమానులకు పరిహారం ఇవ్వకుండా, ఆ సొమ్మును దోచుకుని దాచుకున్నారు’’ అని విమర్శించారు.
Kidnap In Narasaraopet : నరసరావుపేటలో కిడ్నాప్ కలకలం.. జువెలరీ షాపులో పని చేసే వ్యక్తి అపహరణ
మరోవైపు తాను ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించకపోవడంపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించాడు. తన ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పాడు. ఎమ్మెల్యే ఆర్థర్ ప్రొటోకాల్, తన ప్రొటోకాల్ వేరని, అందువల్లే ఇద్దరూ కలవలేకపోతున్నట్లు చెప్పాడు. ఎమ్మెల్యేది లోకల్ ప్రొటోకాల్ అయితే, తనది రాష్ట్రవ్యాప్త ప్రొటోకాల్ అన్నాడు. అమ్మ ఒడి, నాడు-నేడు వంటివి ఎమ్మెల్యే స్థాయి కార్యక్రమాలని చెప్పాడు.