Kidnap In Narasaraopet : నరసరావుపేటలో కిడ్నాప్ కలకలం.. జువెలరీ షాపులో పని చేసే వ్యక్తి అపహరణ
నరసరావుపేట లో కిడ్నాప్ కలకలం రేగింది. జువెలర్స్ లో పని చేస్తున్న రామాంజనేయులు (31) కిడ్నాప్ అయ్యాడు.

Kidnap In Narasaraopet
Kidnap In Narasaraopet : నరసరావుపేట లో కిడ్నాప్ కలకలం రేగింది. కళ్యాణ్ జువెలర్స్ లో పని చేస్తున్న రామాంజనేయులు (31) కిడ్నాప్ అయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాప్ నుండి బయటకు రమ్మని ఫోన్ రావడంతో రామాంజనేయులు బయటకు వచ్చాడు. ఇంతలో ముఖానికి కర్చీఫ్ లు, మాస్కులు పెట్టుకుని ఐదుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారు రామాంజనేయులుని రోడ్డుపై కొట్టుకుంటూ ఆటోలో తీసువెళ్లారు.
రామాంజనేయులు భార్య ప్రసన్న లక్ష్మి (26) వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రామాంజనేయులను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.