Fire In Car : తిరుమలలో కలకలం రేగింది. ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బాలాజీ బస్టాండ్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. బాలాజీ బస్టాండ్.. ఎక్కువ మంది జనంతో కూడిన సర్కిల్ అది. బాలాజీ బస్టాండ్ కు అత్యంత సమీపంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. వేరే ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు తమ కారుని అక్కడ పార్క్ చేసి ఉంచారు.
అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు గల కారణాలు ఏంటన్నది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చేలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, ఆ సమయంలో భక్తులు ఎవరూ వాహనంలో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. బాలాజీ బస్టాండ్ కు అత్యంత సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటు భక్తులు, ఇటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read : సడెన్‌గా పవన్ కల్యాణ్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు.. కారణం అదేనా?