Dharmana Krishna Das : వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌పై కేసు నమోదు
Dharmana Krishna Das : మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌పై కేసు నమోదైంది.
- Harish Thanniru
- Updated on- August 4, 2026 / 10:57 AM IST
Case registered against YCP leader Dharmana Krishna Das
Dharmana Krishna Das : మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌పై కేసు నమోదైంది. శ్రీకాకుళం రూరల్, ఆముదాలవలస, ఎచ్చెర్ల, జేఆర్ పురం, గార పోలీస్ స్టేషన్లలో ఆయనతో పాటు మరో నలుగురుపైన కేసులు నమోదయ్యాయి.
Also Read : AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్వాక్రా మహిళలకు శుభవార్త..
జులై 30న మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన కోసం పోలీసుల అనుమతికి ధర్మాన కృష్ణదాస్‌తో పాటు మిగిలిన నలుగురు దరఖాస్తు చేశారు. పలు నిబంధనలు విధిస్తూ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, జగన్ పర్యటనలో అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు, జన సమీకరణ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు, నమోదైన సెక్షన్లు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
