Govt Liquor Shop : ప్రభుత్వ మద్యం షాపులో నగదు మాయం..సేల్స్ మెన్లు, సూపర్ వైజర్లు బదిలీలు

ఏపీలో మద్యం షాపులన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గత కొంతకాలం క్రితం గవర్నమెంట్ నిర్వహించే మద్యం షాపుల్లో నగదు మాయం అవ్వటం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో సేల్స్ మెన్ల నుంచి సూపర్ వైజర్లను ఆకస్మిక బదిలీలు చేశారు.

Govt Liquor Shop

Cash missing In AP Government Liquor Shop: ఏపీలో మద్యం షాపులన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గత కొంతకాలం క్రితం గవర్నమెంట్ నిర్వహించే మద్యం షాపుల్లో నగదు మాయం అవ్వటం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో జిల్లాలోని 266 ప్రభుత్వ మద్యం షాపుల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

విశాఖ జిల్లాలోని సర్కిల్-4లో ఉన్న నాలుగు షాపులు మినహా..అన్ని షాపులు సవ్యంగానే ఉన్నాయని తెలిపారు.అలాగే నగరంలోని అన్ని ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే సేల్స్ మెన్ల నుంచి సూపర్ వైజర్లను ఆకస్మిక బదిలీలు చేసింది ప్రభుత్వం. సర్కిల్ -4 మద్యం షాపుల నుంచి నగదు పక్క దారి పట్టిందనే కారణంగా సేల్స్ మెన్ల నుంచి సూపర్ వైజర్లను ఆకస్మిక బదిలీలు చేశారు. కాగా..విశాఖలోని సర్కిల్-4 పరిధిలో నాలుగు షాపుల్లో 33లక్షలు మాయం చేసిన విషయం తెలిసిందే. బదిలీలు చేసిన ఉత్తర్వులు నేటి నుంచి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.