Central Home Ministry : ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ.. మాజీ సీఐడీ డీజీపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

సీఐడీ మాజీ డీజీ సునీల్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

Central Home Ministry

Central Home Ministry : సీఐడీ మాజీ డీజీ సునీల్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఏపీ సీఎస్ ను ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. నిబంధనలు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా సునీల్ వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.

లక్ష్మీనారాయణ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ సునీల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ ను ఆదేశించింది.  సునీల్ కొంతమందిని టార్గెట్ చేస్తున్నారని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. చట్టాన్ని ఒక వెపన్ గా చేసుకొని తన ఇష్టానుసారంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.

AP Employees Salaries : జీతాలు చెల్లించండి మహాప్రభో.. ఏపీ సీఎస్‌కు సచివాలయ ఉద్యోగుల లేఖ

దీంతో సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని అక్టోబర్17, 2022న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ లేఖపై స్పందిస్తూ ఫిబ్రవరి 3వ తేదిన సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.