Centre Funds : ఏపీకి 3వేల 847 కోట్లు, రూ.1,998 కోట్లు.. నిధులు విడుదల

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాల నిధులు విడుదల చేయగా.. ఇందులో భాగంగా ఏపీకి రూ.3,847 కోట్లు

Centre Funds

Centre Funds : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాల నిధులు విడుదల చేయగా.. ఇందులో భాగంగా ఏపీకి రూ.3,847 కోట్లు, తెలంగాణకు రూ.1,998 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో తెలుగు రాష్ట్రాలకు కాస్త ఊరట లభించనుంది. 28 రాష్ట్రాలకు కలిపి రెండు విడతల పన్ను వాటాను రూ.95,082 కోట్లు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ.

Petrol : వాహనదారులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

నవంబర్‌ 15న జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్‌ గవర్నర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన హామీ ప్రకారం రెండు విడతల పన్ను వాటాను రాష్ట్రాలకు విడుదల చేసింది కేంద్రం. సాధారణంగా నెలవారీ పన్ను వాటా రూ.47,541 కోట్లు కాగా, రెండు నెలలు కలిపి ఒకేసారి రూ.95,082 కోట్లు విడుదల చేసింది.

ఏ రాష్ట్రానికి ఎంతంటే…