Petrol : వాహనదారులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గనుందా? పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకాస్త తగ్గనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గించేందుకు కేంద్రం..

Petrol : వాహనదారులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

Petrol

Petrol : వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గనుందా? పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకాస్త తగ్గనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇంధన ధరలను మరింత తగ్గించేలా చర్యలు చేపట్టిన కేంద్రం, ఇందులో భాగంగా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లో ఉన్న 5 మిలియన్ క్రూడాయిల్ బ్యారెళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. దీని వల్ల ఇంధన సరఫరా పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Water : అధిక మోతాదులో నీరు తాగుతున్నారా!..అయితే జాగ్రత్త?…

కాగా, ఈ నెల మొదటి వారంలో(నవంబర్ 3) పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ తగ్గించాయి. ఎక్సైజ్ సుంకంతో పాటు వ్యాట్ కూడా తగ్గడంత పెట్రోల్, డీజిల్ ధరలు బాగా తగ్గాయి.

స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్‌లో ఉన్న 5 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను రిలీజ్ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్‌లో ఉన్న 5 మిలియన్ బ్యారెళ్లు అంటే 50 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ విడుదలైతే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత దిగొస్తాయి.

మంగళవారం కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. లిక్విడ్ హైడ్రోకార్బన్ల ధర “సహేతుకంగా, బాధ్యతాయుతంగా మార్కెట్ శక్తులు నిర్ణయించాలి” అని భారతదేశం గట్టిగా విశ్వసిస్తోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.

Computer Work : గంటల కొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే

ప్రస్తుతం ఇంధన ధరలు మొదలు గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు భగ్గుమంటున్నాయి. టమాట ధర కూడా చుక్కలను తాకుతోంది. పెరిగిపోయిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. బతుకు కష్టంగా మారింది. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు మరింత తగ్గితే జనాలకు ఊరట దక్కినట్టు అవుతుంది.