Challa Family Dispute : అవుకులో హైటెన్షన్.. చల్లా కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విబేధాలు

నంద్యాల జిల్లా అవుకులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.

Challa Family Issues

Nandyal Distric : నంద్యాల జిల్లా అవుకులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. చల్లా కుటుంబంలో ఎప్పటి నుంచో ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఈసారి ఘర్షణ, పరస్పరం దాడి వరకు వీరి వివాదం వెళ్లింది. చల్లా పెద్ద కుమారుడు చల్లా విగ్నేశ్వర్ రెడ్డికి, చిన్న కుమారుడి సతీమణి చల్లా శ్రీలక్ష్మీకి మధ్య వార్ నడుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన చల్లా శ్రీలక్ష్మి, విగ్నేశ్వర్ రెడ్డిలు వర్గాలుగా విడిపోవడం, గొడవలకు దిగడంతో ఆవుకులో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆవుకులోని చల్లా భవన్ లో తనపై భావ, ఆడపడుచులు దాడిచేశారని చల్లా శ్రీలక్ష్మి ఆరోపించారు.

Also Read : Congress Party: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం.. తెలంగాణ, ఏపీలకు కొత్త ఇన్‌చార్జ్‌ల నియామకం

కారు పార్కింగ్ విషయంలో వీరి మధ్య ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి, ఆవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మిపై బావ చల్లా విజ్ఞేశ్వర రెడ్డి, రఘునాథ్ రెడ్డి, దుగ్గిరెడ్డి రవీంధ్రనాథ్ రెడ్డిలు దాడి చేసినట్లు సమాచారం. ఒకరిపై ఒకరు దాడిచేసుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణలో చల్లా శ్రీలక్ష్మి గొంతు నులుమడంతో రాత్రి 108లో బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను సిబ్బంది తరలించారు. ఆమెకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆవుకులో చల్లా నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.