Heavy Rain : ఏపీకి మళ్లీ వాన గండం.. మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీకి మళ్లీ వాన గండం పొంచివుంది. రాష్ట్రంలో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Chance of heavy rain in AP : ఏపీకి మళ్లీ వాన గండం పొంచివుంది. రాష్ట్రంలో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసమీ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. కడప, అనంతపురం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Special Trains : శబరిమలకు ప్రత్యేక రైళ్లు

రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు వెల్లడించింది. ఎల్లుండి పలు చోట్ల వానలు కురుస్తాయిని తెలిపింది. కడప జిల్లాలోని పలు చోట్ల పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు