Chandrababu Custody : నేడే తీర్పు..‍! చంద్రబాబు కస్టడీ పిటిషన్, ఏసీబీ కోర్టు తుది నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు లిస్ట్ కాలేదు కాబట్టి ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరించే అవకాశం ఉంది. Chandrababu Custody

Chandrababu Custody Petition

Chandrababu Custody Petition : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలు కేసులపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది. కొన్ని కేసుల్లో తీర్పు రిజర్వ్ చేసి ఉన్నాయి. మరికొన్ని కేసులు వాయిదా పడ్డాయి. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పైనా వాదనలు ముగిశాయి. ఇవాళ(సెప్టెంబర్ 22) ఉదయం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పుని రిజర్వ్ చేశారు. అయితే, హైకోర్టులో ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పు లిస్టింగ్ లో నమోదు కాలేదు. దాంతో కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read..Arunkumar Vundavalli : బాంబు పేల్చిన ఉండవల్లి.. చంద్రబాబు కేసుని సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్

హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాస్ పిటిషన్ కు, కస్టడీ పిటిషన్ కు సంబంధం ఉంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తుది ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు తెలిపింది. నేడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా వేస్తామన్నారు. ఇప్పుడు క్వాష్ పిటిషన్ తీర్పు లిస్ట్ కాలేదు కాబట్టి ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పైన తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

ఇవి కాకుండా చంద్రబాబుపై మరో కస్టడీ పిటిషన్ వేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఏ-1 నిందితుడిగా ఉన్నారని సీఐడీ పేర్కొంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది.

Also Read..YS Jagan Mohan Reddy : జైల్లో చంద్రబాబు.. మరోసారి సీఎం అయ్యేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి

చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత కక్ష సాధింపుతోనే సీఎం జగన్.. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఇందులో ఎలాంటి కుట్ర, రాజకీయ కక్ష సాధింపు లేదంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు స్కామ్ చేశారని, సాక్ష్యాలతో అరెస్ట్ చేశారని అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు నుంచి చంద్రబాబు బయటపడినా, మరిన్ని కేసులు రెడీగా ఉన్నాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు