టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ రిపోర్టు మెమో రూపంలో హైకోర్టుకు అందజేశారు. చంద్రబాబు కంటి ఆపరేషన్, హెల్త్ కండీషన్ వివరాలకు సంబంధించిన నివేదికను న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా హైకోర్టుకు ఇచ్చారు. వైద్యుల సూచనల నివేదికను మెమో ద్వారా కోర్టుకు సమర్పించారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబు తీసుకుంటున్న చికిత్స వివరాలను అందులో పొందుపరిచారు. చంద్రబాబు చర్మ సంబంధిత చికిత్స, గుండె సంబంధిత సమస్యలపై చికిత్స తీసుకుంటున్నట్లు నివేదికలో తెలిపారు.
గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, కొన్ని రోజుల పాటు చంద్రబాబుకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు కోర్టుకి అందజేసిన హెల్త్ రిపోర్టులో తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు చంద్రబాబు మందులు వాడాలని వైద్యులు సూచించినట్లు మెమోలో తెలియజేశారు. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను కోర్టుకు వెల్లడించారు.
Also Read : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు
చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని, చంద్రబాబు కంట్లో 5 వారాల పాటు చుక్కల మందు వేయాల్సిన అవసరం ఉంటుందని మెమోలో పేర్కొన్నారు. ఈ మేరకు 5 వారాల పాటు కంటి చెకప్ కోసం షెడ్యూల్ ను కోర్టుకు అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు 5 వారాల పాటు రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించినట్లుగా కోర్టుకు తెలియజేశారు న్యాయవాది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 52 రోజుల తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు చంద్రబాబుకి నాలుగు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.