Chandrababu Angry With TDP Leaders : టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్..ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా తప్పించుకుంటున్నారని ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు క్లాస్ పీకారు. ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు పాల్గొనకుండా తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కానిస్టేబుల్ ఇంటికొచ్చినా హౌస్‌ అరెస్ట్ అయ్యామని కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు. గృహనిర్బంధానికి పోలీసులు ఇంటికొస్తే నిలదీయాలన్నారు.

Chandrababu Naidu on chennupati

Chandrababu Angry With TDP Leaders : టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు క్లాస్ పీకారు. ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు పాల్గొనకుండా తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కానిస్టేబుల్ ఇంటికొచ్చినా హౌస్‌ అరెస్ట్ అయ్యామని కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు.

గృహనిర్బంధానికి పోలీసులు ఇంటికొస్తే నిలదీయాలన్నారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తే కోర్టులకు వెళ్దామన్నారు. పోలీసులపై కోర్టుల్లో కేసులు వేద్దామన్నారు. టీడీపీ లీగల్‌ సెల్‌ను మరింత పటిష్టంగా తయారు చేస్తున్నామన్నారు.

TDP NDA Alliance : ఎన్డీయేలో చేరికపై పార్టీ కేడర్‌కు చంద్రబాబు క్లారిటీ.. రాష్ట్ర ప్రయోజనాలను బట్టే పొత్తులపై నిర్ణయం

అటు టీడీపీ కోసం త్యాగం చేసిన కార్యకర్తలకే పదవులిస్తామన్నారు. ఈ మూడేళ్లలో పోరాడి కేసుల్లో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. అక్రమ కేసుల్లో జైలుకెళ్లిన వారిని పార్టీ యోధులుగా గుర్తిస్తామన్నారు.