నేను, పవన్ కల్యాణ్ సహా అందరమూ దీనికి బాధితులమే: చంద్రబాబు

Chandrababu Naidu: మరో 53 రోజులే జగన్ పాలన ఉంటుందని చెప్పారు. అడ్డు వస్తే తొక్కుకు పోవడానికి తాను సిద్ధమని చెప్పారు.

Chandrababu Naidu

బాపట్ల జిల్లా పర్చూరు నియోజక వర్గం ఇంకొల్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో తాను, పవన్ కల్యాణ్ సహా అందరమూ బాధితులమే అయ్యామని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, ఇంకా దీనిపై ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ధైర్యం ఉంటే పర్చూరు సభకు వచ్చిన జనాన్ని చూడాలని జగన్‌కు సవాలు విసిరారు. ఈ జనాన్ని చూస్తే జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయని చెప్పారు.

సభకు భూమి ఇచ్ఛిన రైతును అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. మరో 53 రోజులే జగన్ పాలన ఉంటుందని చెప్పారు. అడ్డు వస్తే తొక్కుకున పోవడానికి తాను సిద్ధమని చెప్పారు. వైసీపీని భూస్థాపితం చేసేందుకు అందరూ సిద్ధమా అని ప్రశ్నించారు. తన అనుభవం ముందు జగన్ ఒక బచ్చా అని అన్నారు. ఎన్నికలకు ముందే టీడీపీ విజయం ఖాయమైందని తెలిపారు.

చంద్రబాబు కామెంట్స్

  • రాముడు లాంటి వాడికే రావణాసురుడు వల్ల ఇబ్బందులు వచ్చాయి
  • అటువంటి రావణాసురుడిని సాగనంపవలసిన భాద్యత మీపై ఉంది
  • ఈ భూమి మీద ఏమి దొరికినా జగన్ వదలరు
  • ఉదయం అల్పాహారం ఇసుక మధ్యాహ్నం సాయంత్రం గ్రానైటైనింగ్ రాత్రుల్లో జే బ్రాండ్ మద్యంతో డిన్నర్ చేసుకుంటారు
  • రాష్ట్రంలో అధికారం ఉందనే గర్వంతో ఊర్లపై ఆంబోతులు పడ్డట్లు అన్ని వర్గాలపై పడి అక్రమ కేసులు పెట్టారు
  • టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారస్తులకు అండగా ఉంటాం
  • టీడీపీ హయాంలో ఏనాడూ పెరుగని కరెంట్ బిల్లులు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 7 సార్లు పెంచారు
  • ఉద్యోగ క్యాలెండర్, మద్యపాన నిషేధం, సీపీఎస్ రధ్దు, గుంతల రోడ్లపై ఎందుకు బటన్ నొక్కలేదు
  • మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎక్కడ బట్టిన ఆక్రమాలు చేసి దోపిడీకి ప్రాధాన్యత ఇచ్చారు

 

 Read Also: నారా లోకేశ్ ఆ కుర్చీని మడతపెట్టడంపై పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు