Chandrababu Naidu
రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
“అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పoపడ్ స్టోరేజ్ విద్యుత్ ను పూడిమాడకకు తెచ్చి వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తయ్యే హైడ్రోజన్ తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయి.
హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఎగుమతులు పెరిగి మనకి లాభం వస్తుంది. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తుల కి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుంది. ఎన్టీపీసీ లో బొగ్గు మండించటం ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ ని పూడిమడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తి కి వాడితే కాలుష్యం తగ్గుతుంది.
గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ను టెకోవర్ చేసి గ్రీన్ ఆమ్మోనియాను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ ప్లాంట్ మీద 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయి. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్సెడ్ గ్యాస్ తయారీకి 500కేంద్రాలు పెడుతోంది.
ఒక్కో కేంద్రంలో 130 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. బయోగ్యాస్ కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుంది. ఈ గడ్డి పెంచటానికి ఎకరాకు రూ.30వేల కౌలు రైతులకు రిలయన్స్ చెల్లిస్తుంది. ఈ కేంద్రాల వల్ల ఉద్యోగాలు వచ్చి, గ్యాస్ ఉత్పత్తి లో వచ్చే వ్యర్ధాలు భూసారం పెంచేందుకు ఎరువు గానూ ఉపయోగపడుతుంది.
బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీలు మోడల్ ని కుప్పంకి తెచ్చింది. కుప్పంలో సూర్యఘర్ అమల్లో ఉన్న ఇళ్లకు స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ఇంటి యజమానికి డబ్బులు చెల్లిస్తుంది. ఇది కుప్పం సూర్యఘర్ ఇంటి వాసులకు అదనపు ఆదాయం కానుంది” అని అన్నారు.
PM Modi Podcast: మోదీ- ఇటలీ ప్రధాని మెలోనీపై సోషల్ మీడియాలో మీమ్స్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?