PM Modi Podcast: మోదీ- ఇటలీ ప్రధాని మెలోనీపై సోషల్ మీడియాలో మీమ్స్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?

ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్ కాస్ట్ లో అతిథిగా పాల్గొన్నారు.

PM Modi Podcast: మోదీ- ఇటలీ ప్రధాని మెలోనీపై సోషల్ మీడియాలో మీమ్స్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?

PM Narendra Modi

Updated On : January 11, 2025 / 3:02 PM IST

PM Modi Podcast: ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్ కాస్ట్ లో అతిథిగా పాల్గొన్నారు. మోదీతో ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను నిఖిల్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. రెండు గంటలపాటు సాగిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయాలు, నాయకత్వ సవాళ్లు,  తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. రాజకీయాల్లో రావాలనుకుంటున్న యువతకు మోదీ కీలక సూచన చేశారు. రాజకీయాల్లో విజయవంతం కావడానికి మీకు అంకితభావం, నిబద్ధత అవసరం. సొంత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు రాజకీయాల్లోకి రావొద్దు.. ప్రజా సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలని మోదీ అన్నారు. ఈ క్రమంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రసంగాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అప్పుడు నేనేదో అని ఉంటాను. పొరపాట్లు జరుగుతుంటాయి. నేనూ మనిషినే, భగవంతుడిని కాదు కదా..’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.

Also Read: KTR Meets KCR : కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..

మోదీ తన స్కూల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నేను స్కూల్ లో సాధారణ విద్యార్థిని. ఓ ఉపాధ్యాయుడు మాత్రం నాపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.  అతను మా నాన్నను కలిసి.. నేను మంచి ప్రతిభకలిగిన విద్యార్థినని, దేనిమీద సరిగా ఫోకస్ చేయడు అని చెప్పారని మోదీ పేర్కొన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా తనకు వీసా ఇచ్చేందుకు నిరాకరించడంపై మోదీ ప్రస్తావిస్తూ.. ఆ రోజు నేను మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా వీసాను అమెరికా ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని చెప్పాను. అదే సమయంలో ‘‘ప్రపంచం మొత్తం ఇండియన్ వీసా కోసం నిలబడే రోజు వస్తుందని చెప్పాను. 2005లో నేను ఈ మాట అన్నాను. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇప్పుడు భారత్ టైం అని మోదీ చెప్పారు.

Also Read: Cm Revanth Reddy : ఆదివాసీలపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు..

గోద్రా అల్లర్లపై ప్రధాని మాట్లాడుతూ.. 2002లో గుజరాత్ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో గోద్రా ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. గోద్రా ఘటన గురించి అధికారులు నాకు చెప్పగానే అక్కడికి వెళ్తానని చెప్పాను. అయితే, సింగిల్ ఇంజన్ చాపర్ మాత్రమే ఉంది. మీరు వీఐపీ అనుమతించలేమని అధికారులు చెప్పారు. నేను వీఐపీని కాదు సామాన్యుడిని అని చెప్పాను. ఏం జరిగినా నేను బాధ్యత వహిస్తానని చెప్పానని మోదీ తెలిపారు. గోద్రా ఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆ ఘటనను తలచుకొని ఎంతో బాధపడ్డా. కానీ, నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నా భావోద్వేగాలను నియంత్రిచుకున్నానని మోదీ చెప్పారు.

Also Read: Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు..

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, నిఖిల్ కామత్ తెలివిగా ఆ విషయాన్ని మోదీ ముందు ప్రస్తావించారు. నాకు ఇష్టమైన ఆహారం పిజ్జా.. ఆ పిజ్జా అనేది ఇటలీ నుంచి వచ్చింది. అయితే, మీరు ఇటలీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా.. మీరు ఈ మెలోడీ మీమ్స్ చూడలేదా అని నవ్వుతూ మోదీని అడగ్గా.. తాను అలాంటి మీమ్స్ చూడలేదు.. అలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందులోపడి తాను తన విలువైన సమయాన్ని వృథా చేసుకోలేను అని మోదీ సమాధానం ఇచ్చారు. ఇదిలాఉంటే.. పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ప్రారంభంలో నిఖిల్ కామత్.. నేను తొలిసారి మిమ్మల్ని పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అనగా.. నాక్కూడా ఇదే తొలి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ అని మోదీ పేర్కొన్నారు.