వైసీపీ పాలనలో రఘురామకృష్ణరాజు అనేక కష్టాలు పడ్డారు: చంద్రబాబు

రఘురామ కృష్ణరాజును అరెస్టు చేసిన సమయము నుంచి విడుదలయ్యే వరకు జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకున్నానని అన్నారు.

Chandrababu Naidu

వైసీపీ పాలనలో రఘురామకృష్ణరాజు అనేక కష్టాలు పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌గా ఉండి ఎమ్మెల్యే, టీడీపీ నేత రఘురామ కృష్ణరాజు బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు మాట్లాడారు.

వైసీపీ ఎంపీగా రఘురామకృష్ణరాజు ఉన్న సమయంలోనూ ఆయనను జగన్మోహన్ రెడ్డి చిత్రహింసలకు పెట్టారని చెప్పారు. పుట్టినరోజునే అరెస్టు చేసి, గుంటూరు సీఐడీ కార్యాలయంలో నలుగురు పోలీసులు ముసుగు వేసుకొచ్చి రఘురామకృష్ణరాజును చితక బాదారట అని అన్నారు.

రఘురామకృష్ణ రాజుకు హార్ట్ ఆపరేషన్ అయిందని, తెలిసి కూడా జగన్ అటువంటి పనులకు పాల్పడ్డారని తెలిపారు. రఘురామ కృష్ణరాజును అరెస్టు చేసిన సమయము నుంచి విడుదలయ్యే వరకు జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకున్నానని అన్నారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రఘురామ కృష్ణరాజు ఎన్నో కష్ట, నష్టాలు తట్టుకుని నిలబడ్డారని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి రఘురామ కృష్ణంరాజుని చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. తాను చేయని తప్పుకు రాజ ద్రోహం కేసు పెట్టి చితకబాదారని తెలిపారు. రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఐదు సంవత్సరాలు రఘురాం కృష్ణరాజు తన పార్లమెంటు నియోజకవర్గంలో అడిగిపెట్టనివ్వకుండా జగన్ చేశారని అన్నారు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చట్టసభల్లో అడిగి పెట్టలేకపోతున్నారని చెప్పారు.

వికారాబాద్ కలెక్టర్‌పై దాడి చేయడం తప్పే, కానీ..- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..