Chandrababu Naidu
Chandrababu Naidu: వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఙవాళ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చంద్రబాబు మాట్లాడారు.
ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. గతంలోనూ అమరావతికి నిధులు రాకుండా అడ్డుకుందని చెప్పారు. (Chandrababu Naidu)
అసత్య ప్రచారాలు చేస్తున్నవారి పార్టీనే మునిగిపోయిందని, అమరావతి మునిగిపోలేదని తెలిపారు. వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని, అప్పుడే ఏపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదని, అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
“ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నిర్మూలించాలని ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను. దోమల ద్వారా మలేరియా వస్తుంది.. డెంగీ, చికెన్ గున్యా వస్తుంది, కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి.. లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది.
Also Read: డబ్బుల కట్టల గుట్టలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్.. పోతపోత పైసలన్నీ పట్టుకపోతవా?
బలహీనం అయిపోతున్నారు.. అందుకే ఈరోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ దోమలను పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్లం.. ఇవన్నీ గత వైసీపీ చేయలేదు.
ప్రజారోగ్యాన్ని పట్టించుకోలేదు. చాలా ఇబ్బందులు వచ్చాయి.. నేను అప్పట్లో దోమలపైన యుద్ధం అన్నాను.. యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు.
అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడతాయి. ఒకరికి క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది. ఒక అనారోగ్య సమస్య వస్తే మీరు కాదు బాధపడేది మీ ఇంట్లో అందరూ బాధపడతారు.
అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే, దోపిడీ విధానాలు అమలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం ఉండదు. ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో.. అలాంటి వ్యక్తికే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది.
దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి. నేను ఆరోజు సూపర్ సిక్స్ అన్నాను.. చాలామంది ఇది సాధ్యం కాదన్నారు. ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు అమలు చేస్తున్నాము” అని తెలిపారు.