Margani Bharat
Margani Bharat – Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదని, చంద్రబాబును సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు.
తాజాగా అఖిలపక్ష సమావేశంలోనూ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో సానుభూతికి అఖిలపక్ష సమావేశాన్ని వేదికగా మార్చుకునేందుకు టీడీపీ ఎంపీలు ప్రయత్నం చేశారని వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మార్గాని భరత్ ఆరోపించారు.
Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?
చంద్రబాబు ఒక క్రిమినల్ అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రధారి, లబ్దిదారు అని అన్నారు. అందుకే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.
కాగా, టీడీపీ ఎంపీలు ఎదురుదాడికి దిగారు. సీఎం జగన్ పై పెట్టిన కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని టీడీపీ ఎంపీలు ప్రశ్నించారు. జీ 20 సమావేశాల సందర్భంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం డెమోక్రసీకి బ్లాక్ డే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు టీడీపీ ఎంపీలు. దీనికి వైసీపీ ఎంపీలు కౌంటర్ ఇచ్చారు.
Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?
జీ20 సమావేశాలు జరుగుతున్నాయని 420లను వదిలివేయాలా? స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబే ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారు కూడా అని అఖిలపక్ష నేతలకు వివరించారు ఎంపీ భరత్. స్కిల్ కుంభకోణంలో సాక్ష్యాలతో సహా చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారిన మార్గాని భరత్ చెప్పారు. అంతేకాదు.. జగన్ పై పెట్టిన ఆ కేసులన్నీ కాంగ్రెస్ రాజకీయ కక్షతో పెట్టినవే అని ఎంపీ భరత్ స్పష్టం చేశారు.