దాడులు వద్దు, సంయమనం పాటించండి- టీడీపీ కేడర్‌కు చంద్రబాబు పిలుపు

వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.

Chandrababu Naidu : వైసీపీ కవ్వింపు చర్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ సంయమనం పాటించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా తీశారు. కొన్నిచోట్ల నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు చంద్రబాబు.

వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు సూచించారు. నాయకులు సైతం అప్రమత్తంగా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు చంద్రబాబు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారాయ. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.

కాగా, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గుడివాడలో కొడాలి నాని ఇంటిపై దాడి జరిగింది. టీడీపీ శ్రేణులు గుడ్లు, రాళ్లు విసిరారు. ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అటు మరో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఇంటి దగ్గర కూడా ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ కార్యకర్తలు.. వంశీ ఇంటి ముందు హల్ చల్ చేశారు. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దమ్ముంటే బయటకు రా అని సవాల్ విసిరారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపేశారు.

Also Read : కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరిన టీడీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత