కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరిన టీడీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత

కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, గుడ్లు విసిరారు. జై చంద్రబాబు, డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి.. టపాసులు కాల్చారు.

కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరిన టీడీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత

tension at kodali nani house in gudivada due to tdp workers protest

Kodali Nani House Attacked: వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, గుడ్లు విసిరారు. జై చంద్రబాబు, డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి.. టపాసులు కాల్చారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని.. మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ మాట్లాడుతూ.. గుడివాడలో కొడాలి నానికు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యానం చేస్తానని చాలెంజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: ఆ వాలంటీర్‌ కుటుంబానికి అండగా నిలిచిన కొడాలి నాని.. రూ.5 లక్షల సాయం

”జగన్ ఒక్క సైగ చేస్తే టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికావు. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావ్. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం దమ్ముంటే బయటికి రా. బొచ్చు పీకుతారా అన్నావ్ వచ్చి మాకు సమాధానం చెప్పు. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి ఎవరొస్తారో రండని రెచ్చగొట్టావు. తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావ”ని పొట్లూరి దర్శిత్ అన్నారు.