ఆ వాలంటీర్‌ కుటుంబానికి అండగా నిలిచిన కొడాలి నాని

Kodali Nani: భవిష్యత్తులోనూ అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.

ఆ వాలంటీర్‌ కుటుంబానికి అండగా నిలిచిన కొడాలి నాని

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమితో మనస్తాపం చెంది.. కృష్ణా జిల్లా గుడివాడ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన పిట్టా అనిల్‌కుమార్‌(26) అనే వాలంటీర్  బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కొడాలి నాని అతని కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షలు సాయం చేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనిల్‌కుమార్‌ పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానని హామీయిచ్చారు.

కాగా, గుడివాడలో టీడీపీ అభ్యర్థి చేతిలో కొడాలి నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థి రాము 51 వేలకు పైగా ఓట్లతో గెలిచారు. పదేళ్ల తర్వాత గుడివాడలో టీడీపీ గెలిచింది. దీంతో స్థానిక వాలంటీర్ అనిల్ వైసీపీ ఓటమిని తట్టుకోలేకపోయాడు. కుంగుబాటులో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ లో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ సర్కారు వాలంటీర్లను కొనసాగించింది.

Also Read: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ నియామకం