అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ కీలక భేటీ!

TDP-NDA Alliance : అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో గంటన్నర పాటు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండా చంద్రబాబు, పవన్ వెళ్లిపోయినట్టు సమాచారం.

Chandrababu Naidu, Pawan Kalyan hold talks with Amit Shah, J.P. Nadda on alliance

TDP-NDA Alliance : ఏపీలో పొత్తులపై కీలక చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది.

Read Also : Dearness Allowance Hike : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు..!

ఈ భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అందిన సమచారం మేరకు.. అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పొత్తుపై చర్చించారు. త్రిసభ్య పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై చర్చలు సాగాయి.

సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ :
బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ ఏపీలో పొత్తులపై కీలకంగా చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీ, లోక్ సభల బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వేవ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ స్థానాలను బీజేపీ అడుగుతోంది.

అయితే, నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు అమిత్ షా, జేపీ నడ్డాను చంద్రబాబు కలిశారు. బీజేపీకి నాలుగు లోక్ సభ, ఆరు అసెంబ్లీ సీట్లను టీడీపీ ఆఫర్ చేసింది. అయితే, ఆరు లోక్‌సభ 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఆశిస్తుంది. రాజమండ్రి, హిందూపురం రాజంపేట, అరకు స్థానాలను టీడీపీ ఇస్తామని చెబుతోంది.

ఈ నాలుగు స్థానాలతో పాటు ఏలూరు, తిరుపతి, విజయవాడ లోక్‌సభ సీట్లను కూడా ఇవ్వాలని బీజేపీ అంటోంది. మరోవైపు కైకలూరు, ధర్మవరం, విశాఖ నాట్, జమ్మలమడుగు తిరుపతి, ఉభయగోదావరి జిల్లాలో ఒక్కో స్థానం ఇస్తామని టీడీపీ చెబుతోంది. 2014లో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది.

Read Also : Old City Metro Route : ఓల్ట్‌ సిటీలో మెట్రో రూట్ నిర్మాణానికి ముందడుగు..!

ట్రెండింగ్ వార్తలు