Kuppam: వైనాట్ 175 అంటున్న వైసీపీ.. కొత్త టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు.. రీచ్ అవుతారా?

వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.

Chandrababu Naidu set new target one lakh majority in kuppam

Kuppam Chandrababu Target : వైసీపీ ఓడిస్తానంటోంది.. ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ తగ్గొద్దని అంటున్నారు చంద్రబాబు.. మరి కుప్పంలో ఏం జరగనుంది. పోటీ చేసినప్పటి నుంచి ఓటమి ఎరగని చంద్రబాబుకు స్థానిక ఎన్నికల్లో ఝలక్ ఇచ్చిన వైసీపీ (YCP).. బాబును ఓడించగలదా? లక్ష ఓట్ల మెజార్టీ కోసం చంద్రబాబు ఎంచుకున్న వ్యూహమేంటి? అధినేత టార్గెట్‌ను కుప్పం నేతలు రీచ్ అవుతారా? తెరవెనుక ఏం జరుగుతోంది.

కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఏడు సార్లు గెలిచారు. 1989 నుంచి ఇప్పటివరకు ఓటమన్నదే లేకుండా వరుస విజయాలు సాధిస్తున్న చంద్రబాబు.. 1999లో 65,687 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పటివరకు చంద్రబాబు మెజార్టీలో రికార్డు ఇదే.. గత ఎన్నికల్లో బాబు మెజార్టీ 30 వేలకు పడిపోయింది. అంతేకాదు రాష్ట్ర రాజకీయం కూడా మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి చంద్రబాబుతో సహా.. టీడీపీలోని ముఖ్యనేతలు అందరినీ టార్గెట్ చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీతో సహా స్థానిక ఎన్నికల్లో కూడా టీడీపీని ఓడించింది వైసీపీ.. బాబు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు కూడా వీలు లేకుండా రాజకీయం చేస్తోంది. వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని లక్షం పెట్టుకున్నారు బాబు.

అలా టార్గెట్ పెట్టుకున్న బాబు.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. లక్ష ఓట్ల మెజార్టీ టాస్క్‌తో ప్రత్యేకంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అధినేత టార్గెట్‌ను తెలుసుకున్న శ్రీకాంత్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. పోలింగ్ బూత్ వారీగా ఆరా తీస్తున్నారు. గత రెండు మూడు ఎన్నికల్లో ఏ ఏ పోలింగ్ బూత్లో టీడీపీకి ఎంత మెజారిటీ వచ్చింది. ఏ బూత్లో తగ్గింది. ఇంకా పెరగాలంటే ఏం చేయాలన్న దానిపై యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. లక్షే లక్ష్యం అన్న నినాదంతో కుప్పంలో ఒక క్యాంపెయిన్ ప్రారంభించారు. గత నెల కుప్పం వచ్చిన చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ క్యాంపెయిన్ మొదలైంది.

Also Read: పిల్లి సుభాశ్ చంద్రబోస్‌ను ఒప్పించడం త్రిమూర్తులుకు సాధ్యమా.. ఎమ్మెల్సీ ఎలా డీల్ చేస్తారో?

మండలాల వారీగా పార్టీ కేడర్‌ను భాగస్వామ్యం చేస్తూ.. లీడర్లకు కొన్ని బూత్ల బాధ్యతలను అప్పగిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబుతో సహా ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. పనిచేయని వారిని పక్కన పెడుతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామన్న వైసిపి మాటలను పట్టించుకోకుండా భారీ మెజారిటీ కోసం అంతా పని చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు బాబు కూడా వారంలో రెండు మూడు సార్లు కుప్పం నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నేరుగా తనతోనే మాట్లాడేలా కుప్పం నేతలకు యాక్సెస్ ఇచ్చారు. మరోవైపు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదన్న అధికార పార్టీ విమర్శలకు చెక్ చెబుతూ సొంత ఇంటి నిర్మాణం వేగవంతం చేశారు. ఇలా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ కోసం చంద్రబాబు శతవిధాలా పనిచేయడం క్యాడర్‌లో జోష్ పెంచుతోందని చెబుతున్నారు.

Also Read: అద్దె నాయకుడు నువ్వా? నేనా? మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ శ్రీకాంత్.. మరోసారి వేడెక్కిన కుప్పం రాజకీయం

ట్రెండింగ్ వార్తలు